Showing posts with label విరిజల్లు. Show all posts
Showing posts with label విరిజల్లు. Show all posts

Thursday, June 9, 2011

మనసనేది లేని నాడు (గజల్)

మనసనేది లేని నాడు లేవు ప్రేమ గాలు   
వలపనేది లేక లేవు తీపి గుండె కోతలు    

తెలివెన్నెల రేలలో వికసించే తలపులలో 
అనుభవాలు లేక లేవు మధురమైన ఊహలు 
ఆ ఊహలలో తమకించే మరపురాని ఘడియలు    || వలపనేది ||

చూపులలో వసంతాలు కొలువుతీరు వేళలో 
అనుభూతులు లేక లేవు కొత్త బ్రతుకు ఊసులు 
ఆ ఊసులలో చిగురించే కమ్మనైన తావులు           || వలపనేది ||

తొలిమోజుల తొలకరిలో గానమైన భావనలో 
కరిగిపోని జీవితాన లేవు కళలు కాంతులు 
ఆ కాంతులలో పయనించే పరిమళాల వాకిలులు    || వలపనేది ||

                                                                                             రచన : శ్రీ కలగా కృష్ణమోహన్ 
                                                                                             సంగీతం : శ్రీ పి.ఏ.రాజు 


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/listen/350nd1djw7asb5w/07.manasanedi.mp3

కలల కడలిలో(గజల్)

కలల కడలిలో కలికి ముత్యమై  (2)
కనుల కొలనులో చిలిపి నృత్యమై 
ఉండిపోవా కలలలోనా 
నిలిచిపోవా కనులలోనా 

తారలనే అడుగుతాను నిన్ను విడిచిపొమ్మని 
చందురునే కోరుతాను నిన్ను మరచిపొమ్మని
మేఘాలను వేడుతాను నిన్ను పోనిమ్మని 
నీ రాకే తోడై నా యెదను పూలు పూచే           || ఉండి ||

హృదయమనే తలుపు తీసి నిన్ను స్వాగతించినాను
ద్వారమందు నిలిచి  నీవు బేల చూపు చూసినావు
హృదయమా నాహృదయమా (2)
ఆమె స్మృతులే ఇక నీకు జతుల గతులు        || ఉండి ||

కలలోనే  జీవితాన్ని కడతేరి పోనీ 
కనుల నీరు  కడవరకు అటుల నిలిచి పోనీ 
కలకాలం నీ రూపే తలచుకొనీ (2)
నీ రాకే తోడై నా యెదను పూలు పూచే           || ఉండి ||

నీవులేని ప్రతిక్షణము యుగయుగాల నిరీక్షణము
నీ వలపు పిలుపు కోటి వసంతాలు నిలుపు 
ఏలనన్నువీడి నీవు దూరమౌతావు 
నువులేని బ్రతుకునకు ఏదీ మరి తావు        || ఉండి ||

                                                                              రచన : శ్రీ పి.ఏ.రాజు 
                                                                              సంగీతం : శ్రీ నిర్మల్ కుమార్ 



ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?62va3do5k414tr2

వాలు చూపుల (గజల్)

వాలు చూపుల గాలమేసి 
నన్ను దోచే ప్రేయసి
వింతగా నను చూడకే చెలి 
వేగరావే నా దరి                 || వా ||

నీలికన్నుల నీవు  చూసిన
వలపు పూలై విరిసెనే
పరిమళించి - పరవశించి (2)
వేణుగానము చేసెనే  (2)
మది వేణురాగము తీసేనే  || వింతగా   ||

గుండెలో నువు నవ్వినంతనే  
కోటివీణలు మ్రోగునే
ఓపలేని తాపమేదో (2)
నన్ను తొందర చేసెనే  (2)
మదిలోన విందులు చేసెనే  || వింతగా  ||

                                                   రచన : శ్రీ కోపల్లె శివరాం 
                                                   సంగీతం : శ్రీ నిర్మల్ కుమార్ 


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?heaj8am1xk99cj6

Wednesday, June 8, 2011

మరపురాని కలలు గని

మరపురాని కలలు గని
మరుదినమ్ము మేలుకొని
నిరాశయే మిగులునని
తెలుసుకొంటివా మనసా
అలసి యుంటివా(2)

ప్రేమ నిన్న రోజుదని
నేడు కరిగి పోయెనని
వేదనయే రేపటిని
తెల్లమాయెనా
గుండెలు తల్లడిల్లెనా(2) || ||

చిగురు ఎండి రాలునని
ఎగిరిపోవు కోయిలని
క్షణికమే వసంతమని
కనుల గట్టెనా
అశ్రులు కరగి రాలెనా
మనసా అలసటాయెనా (2) || మ ||


                                                  రచన : శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు 
                                                  సంగీతం : శ్రీ చిత్తరంజన్ 


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?79hm9myj9a0i3wa

వాడిపోయిన పూలలోన

వాడిపోయిన పూలలోన
వన్నెచిన్నెలు ఎచటివో (2)
తీగ తెగిన వీణలోన
మ్రోగు స్వనములు ఎవరివో (2) || వా ||

కళలు మాసిన చంద్రబింబం
నిండువెన్నెల విరిసెనో
సాగిపోయే నీలిమేఘం
పూలవానలు కురిసెనో || వా ||

శిధిలమైన మనసులోన
మధురస్మృతులు ఎవరివో
హృదయకుసుమం విరిసి విరిసి
నింగిదారుల కెగెసెనో || వా ||


                                             రచన : శ్రీ ఆచార్య తిరుమల 
                                             సంగీతం : శ్రీ గోపాల కృష్ణ 


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?lmiki7jtf2e455r

Tuesday, June 7, 2011

నీ అందె రవళిలో

నీ అందె రవళిలో
నా డెందమలరగ
నా గళాన సొంపులో
తేనె జల్లు నింపనా|| నీ ||

పూవులు పులకించగ
వెన్నెల విరబూయగ
మధుర మధుర లోకాలలో
నీకు జోలపాడనా || నీ ||

రాగతాళ లయలలో
పదములు కదిలించగ
లలిత లలిత రాగాలతో
వలపు గీతి పాడనా || నీ ||


                                       రచన : శ్రీ శామ్యూల్
                                       సంగీతం : శ్రీ పి.ఏ.రాజు 


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?bj1c7v0m89m1w1a

దిగిరావె అందాల

దిగిరావె అందాల
దివినేలిన రాణి
కవిరాజు పెదవిపై
కదలు మధుపాత్రవై || దిగి ||

కలలోని కాంతిగ
ఇలలోని సుఖముగ
విరిలోని తేనెగ
కరిగిపోవకే సఖీ || దిగి ||

నా గళములో నిలచి
నిలచి వెలువడబోకే
అమర సుందర భావన
గీత రాగిణీ
బృందావనాంతర
ముకుంద మురళీ రవమై
గాన మధురేఖవై 
గంధవహరధమ్మువై || దిగి ||

                                                                        రచన : శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్తి 
                                                                         సంగీతం : అజ్ఞాతం 



ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?j64ovk9349kkk32

పాడలేని వేళ

పాడలేనీ వేళ
ఎలకోయిలై నేను
రాగతంత్రులు మీటి
రవళించగా లేను || పాడ ||

శిధిల శిశిరము జూచి - చిన్నబోయిన నేను
మాధురీ సుధలతో - మదిని నింపగలేను
విరహవేదన తోడ వేగిపోయే వేళ
ఆలపించగ లేను ఆశ్లేష గీతికను || పాడ ||

నవసి పోయిన విరులు
ఇరులతో మొరపెట్టి
కమలి పోయిన కురులు
దీనముగా నవ్వేను
ఎదురు చూచిన కనులు
వేసారి  పోయినవి
ఎండుటాకుల జూచి
పాదలేదీ గుండె  || పాడ ||


                                       రచన : శ్రీ పైడిపాల 
                                       సంగీతం : శ్రీ కృష్ణా రావు 



ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?hl8826obt1l744q