Showing posts with label మరికొన్ని భావగీతాలు. Show all posts
Showing posts with label మరికొన్ని భావగీతాలు. Show all posts

Wednesday, June 8, 2011

పాడకే నా రాణి

పాడకే నా రాణి పాడకే పాట
పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే

రాగామాలాపించి వాగులా ప్రవహించి
సుడిచుట్టు గీతాల సురగిపోనీయకె || పా ||

కల్హారముకుళములు కదలినవి పెదవులు
ప్రణయపదమంత్రాల బంధించె జీవనము || పా ||

శ్రుతిలేని నామతికి చతురగీతాలేల
గతిరాని పాదాల కతుల నృత్యమ్మటే || పా ||

మరచిపోయినావ నీవు

మరచిపోయినావ నీవు మాధవా
రాధ ఎదలో బాధ
గాధలుగా మలిచేవా || మ ||

వేచి వేచి చూచినాను
వెదకి వెదకి విసిగినాను
కాటుకతో కనుల నీరు
కరిగి యమునగా పారెనా || ||

వంశినై నే నుదయించి
వాతెరా తీపిని గ్రోలుదు
అనుక్షణమ్ము అధరముపై
వలపు పాటలను పాడుదు || ||