Wednesday, February 27, 2019

పాటల తోట - లలిత గీత , చిత్ర లేఖన విభావరి

సాహితీ గౌతమి ఆహ్వానం
2-3-2019, సాయంత్రం 6 గంటలకు A K C  రోటరీ హాల్(JN రోడ్డు) నందు ONGC సౌజన్యం తో నిర్వహించబడే పాటల తోట - లలిత గీత , చిత్ర లేఖన విభావరి లో నేపథ్య గాయని సునీత గారు లలిత గీతాలు (light music - non-filmy) ఆలపిస్తారు. ప్రత్యేక ఆకర్షణ : శ్రీ కూచి గారు  లలిత గీతం ఆలపిస్తున్న సమయం లో చిత్రలేఖనం పూర్తి చేస్తారు. శ్రీ DMR శేఖర్, Asset  Manager , ONGC ముఖ్య అతిథి. శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు. రసజ్ఞులు, సంగీత సాహిత్యాభిమానులైన మీకు మా ప్రత్యేక ఆహ్వానం. లలిత గీతాల్ని ఆనందించే మీ మిత్రులకు మా తరఫున ఆహ్వానం పలకండి, మీతో తీసుక రండి.  

Saturday, November 24, 2018

సాహిత్య పద యాత్ర 

సాహిత్య పదయాత్ర డిసెంబర్ 8,9,10 (2018)తేదీల్లో జరుగుతుంది. 8,9 రెండవశనివారం, ఆదివారం. 

డిసెంబర్ 7 వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ లో బయలుదేరి 5 గంటలకు కవిరచయితాది నడకధారులందరమూ  శ్రీపాద వారి ఊరు పొలమూరు చేరతాం
ఆ సాయంత్రం 6 నుండి 8 వరకూ ఊరివారిమధ్య సాహిత్య సభ ఉంటుంది. ఆ రాత్రి భోజనాలు, నిద్ర పొలమూరు లోనే. 

డిసెంబర్ 8 వ తేదీ ఉదయం 6 గంటలకి యాత్ర మొదలవుతుంది.
5 కిమీ నడిచి రాయవరం లో అల్పాహారం
వెంటనే 5 కిమీ నడక బలభద్రపురంలో భోజనం, విశ్రాంతి. మధ్యాహ్నం 3 నుంచి మరో 5 కిమీ నడక బిక్కవోలు లో రాత్రి విశ్రాంతి

ఇదే విధంగా తక్కిన రెండు రోజులూ నడక నడుస్తుంది

ఆ రూట్ మేప్  ఫోటో ఇక్కడ అందిస్తున్నాను

10 వ తేదీ న కృష్ణ శాస్త్రి గారి ఊరు చంద్రంపాలెం లో మీటింగ్ తర్వాత అందరం కాకినాడ వచ్చేస్తాం. అక్కడనుంచి కాకినాడ కు అరగంట ప్రయాణం

ఇక్కడ మూడు టెలిఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. దయచేసి మాతో నడవడానికి వస్తున్నవారు ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్పగలరు. 

మధ్యలో కలవాలనుకున్నవారు ఈ నెంబర్లలో ఎవరినైనా పిలిచి అడగవచ్చు. ఎక్కడ ఎలా కలవాలో చెప్తారు. 

మీరు సంప్రదించవలసిన మిత్రుల నెంబర్లు

9440111668

9866055815

9885353033

ఫోన్ కలవని పరిస్థితిలో వాట్సాప్ ఉపయోగించండి

దారిపొడుగునా విరిసిన ఈ పారిజాతాలు మీ కోసం వేచి ఉంటాయి

Friday, March 16, 2018

సాహితి గౌతమి ఆహ్వానం

17-3-2018 న 11:00 గంటలకు ఆదిత్య డిగ్రీ కళాశాల (RTC కాంప్లెక్స్ దగ్గర),రాజమహేంద్రవరం లో ప్రఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక, భౌతిక శాస్త్రవేత్త, అరుదైన మేధావి  స్టీఫెన్ హాకింగ్ సంస్మరణ సభ

శ్రీ ఎండ్లూరి సుధాకర్, పీఠాధిపతి, తెలుగు విశ్వవిద్యాలయం;  శ్రీ Ch ఫణి కుమార్, ప్రిన్సిపాల్, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల; శ్రీ తోరాటి. వసంత రావు, న్యాయవాది, శ్రీ చాగంటి. శరత్ బాబు, విశ్రాంత భౌతిక శాస్త్రోపన్యాసకులు   ప్రసంగిస్తారు 

మీరు, మిత్రులతో  కలసి  సభ కు విచ్చేయండి

మీకిదే మా సాదర ఆహ్వానం

పి విజయ్ కుమార్
అధ్యక్షులు
సాహితీ గౌతమి, రాజమహేం

Sunday, April 26, 2015

kadha rachayitala sveeya Kadhaa Pathanam