Saturday, November 24, 2018

సాహిత్య పద యాత్ర 

సాహిత్య పదయాత్ర డిసెంబర్ 8,9,10 (2018)తేదీల్లో జరుగుతుంది. 8,9 రెండవశనివారం, ఆదివారం. 

డిసెంబర్ 7 వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ లో బయలుదేరి 5 గంటలకు కవిరచయితాది నడకధారులందరమూ  శ్రీపాద వారి ఊరు పొలమూరు చేరతాం
ఆ సాయంత్రం 6 నుండి 8 వరకూ ఊరివారిమధ్య సాహిత్య సభ ఉంటుంది. ఆ రాత్రి భోజనాలు, నిద్ర పొలమూరు లోనే. 

డిసెంబర్ 8 వ తేదీ ఉదయం 6 గంటలకి యాత్ర మొదలవుతుంది.
5 కిమీ నడిచి రాయవరం లో అల్పాహారం
వెంటనే 5 కిమీ నడక బలభద్రపురంలో భోజనం, విశ్రాంతి. మధ్యాహ్నం 3 నుంచి మరో 5 కిమీ నడక బిక్కవోలు లో రాత్రి విశ్రాంతి

ఇదే విధంగా తక్కిన రెండు రోజులూ నడక నడుస్తుంది

ఆ రూట్ మేప్  ఫోటో ఇక్కడ అందిస్తున్నాను

10 వ తేదీ న కృష్ణ శాస్త్రి గారి ఊరు చంద్రంపాలెం లో మీటింగ్ తర్వాత అందరం కాకినాడ వచ్చేస్తాం. అక్కడనుంచి కాకినాడ కు అరగంట ప్రయాణం

ఇక్కడ మూడు టెలిఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. దయచేసి మాతో నడవడానికి వస్తున్నవారు ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్పగలరు. 

మధ్యలో కలవాలనుకున్నవారు ఈ నెంబర్లలో ఎవరినైనా పిలిచి అడగవచ్చు. ఎక్కడ ఎలా కలవాలో చెప్తారు. 

మీరు సంప్రదించవలసిన మిత్రుల నెంబర్లు

9440111668

9866055815

9885353033

ఫోన్ కలవని పరిస్థితిలో వాట్సాప్ ఉపయోగించండి

దారిపొడుగునా విరిసిన ఈ పారిజాతాలు మీ కోసం వేచి ఉంటాయి