నా జీవన సరసి లోన - విరిసిన కల్హారమెవరు
నా చీకటి కుటీరాన - తొలి వెన్నెల రేఖ ఎవరు
అదిగదిగో వస్తున్నది చూడు చూడు చూడరా
ఆమె యే నా జీవిత సర్వస్వమ్మని నమ్మరా
ఆమె యే నా ఊపిరిలో ఒదిగిన ప్రాణమ్మురా || అదిగదిగో ||
నా శూన్యమైన మనోగగనమ్మున హరివిల్లుగ
మెరసి నన్ను ధన్యునిగా చేసిన ఆ కరుణామయి || అదిగదిగో ||
మమత లెరిగిన చల్లని మనసు దాన
కోటి అనురాగ వీణలు మీటుదానా
నా బ్రతుకున నింపితే వెన్నెలలను
ఇంత ఆత్మీయతకు ఏమి ఇవ్వగలను || అదిగదిగో ||
ఆమె తలపులో అశాంతి
మెదల కూడదెన్నడును
ఆ కన్నుల తళుకులు
వసివాడ రాదెన్నడును ||అదిగదిగో ||
రచన : శ్రీ కొంపెల్ల. రామకృష్ణ మూర్తి
సంగీతం : శ్రీ సుందరం
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/listen/f2h3gnfde3zni3x/01.adigadigo.mp3
1 comments:
Felt nice listening to Uncle's voice for the first time :-) .....Very Nostalgic!!!!!!
Post a Comment