మనసనేది లేని నాడు లేవు ప్రేమ గాధలు
వలపనేది లేక లేవు తీపి గుండె కోతలు
తెలివెన్నెల రేలలో వికసించే తలపులలో
అనుభవాలు లేక లేవు మధురమైన ఊహలు
ఆ ఊహలలో తమకించే మరపురాని ఘడియలు || వలపనేది ||
చూపులలో వసంతాలు కొలువుతీరు వేళలో
అనుభూతులు లేక లేవు కొత్త బ్రతుకు ఊసులు
ఆ ఊసులలో చిగురించే కమ్మనైన తావులు || వలపనేది ||
తొలిమోజుల తొలకరిలో గానమైన భావనలో
కరిగిపోని జీవితాన లేవు కళలు కాంతులు
ఆ కాంతులలో పయనించే పరిమళాల వాకిలులు || వలపనేది ||
రచన : శ్రీ కలగా కృష్ణమోహన్
సంగీతం : శ్రీ పి.ఏ.రాజు
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/listen/350nd1djw7asb5w/07.manasanedi.mp3
0 comments:
Post a Comment