మరలిరాదు జాలిలేదు పరిమళానికి
నాకు చాలు గాలిపాట బతకడానికి (2)
మౌనంలోనే బతుకు పరిమళించి పోతుంది
అపుడపుడూ కొత్త ఆశ పలకరించి పోతుంది
అయినా ఎవరున్నారని పలకడానికి
నాకు చాలు గాలి పాత బతకడానికి (2)
తలపులూ వలపులూ తలుపులేసుకుంటాయి
స్నేహాలూ మమతలూ రేవు దాటి పోతాయి
ఎవరూ లేరు గుండె గుబులు తెలపడానికి
నాకు చాలు గాలి పాత బతకడానికి (2)
చైత్రాలు రావు ఇక వసంతాలు లేవు
పరిమళాలు వెలినేసిన తోట పూలు పూయదు
గతమే చాలు ఒంటరిగా గడపడానికి
నాకు చాలు గాలి పాత బతకడానికి (2)
రచన : శ్రీ కలగా కృష్ణ మోహన్
సంగీతం : శ్రీ నిర్మల్ కుమార్
http://www.mediafire.com/?u775r2qkb7l44ma
1 comments:
I remember father rendering this one as one of his favorites and close to heart composition!
Post a Comment