Wednesday, August 14, 2013

గీతాంజలి తత్త్వం

 గీతాంజలి తత్త్వం 

రవీంద్రుని గీతాంజలి ఆంగ్లంలో వుంది. అసలు మాతృక బెంగాలిలో. చలంగారి గీతాంజలి ఆంధ్రంలో వుంది. భాషా పరివర్తనే కాని భావ పరివర్తన లేదు. నిప్పును ఏ భాషలో పిలిచినా కాలకుండా వుండదు. రవీంద్రుని వంగ గీతాంజలి ఛందోబద్ధమైన గీతాలు. రవీంద్రుని ఆంగ్ల గీతాంజలి  ఒక విధమైన లయమయ గద్య. ఛందోమయ రచనలు ధ్వని ప్రధానాలు. 

'మానవుడిలోని పరిమిత ప్రాణం విశ్వంలోని అపరిమిత ప్రాణాన్ని అందుకోడానికి నిరంతరం తహతహలాడుతూనే వుంటుంది. కొద్దిలో ఎన్నడూ  సంతృప్తి లేదు. పెద్దలోనే సంతృప్తి. "నాల్పే సుఖమస్తి భూమైవ సుఖమస్తి." కొద్దిలోనే సుఖాన్ని పొంది సంతృప్తి చెందితే ఇక సృష్టిలో పెరుగుదలేముంటుంది? అందుకే మానవప్రాణం మహాప్రాణాన్ని అందుకోవాలనే సతతాకాంక్ష. మానవప్రాణం మహాప్రాణాన్ని అందుకొనే నిమిత్తం మట్టిని వదలాల్సిన పనిలేదు. కారణం మట్టి  మహాప్రాణానికి విరోధమైంది కాదు. ఇంద్రియానుభూతి ద్వారానే మానవ ప్రాణం అతీంద్రియమైన మహాప్రాణాన్ని అందుకోగలదు. ఇందుకు పరంపరాగత మతాచారాలవసరం లేదు. ఇందుకు కావలసినది  మహా ప్రేమ. ఇదీ గీతాంజలి తత్త్వం." 

స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.

సంగీతము-సాహిత్యము

సంగీతము-సాహిత్యము ల పై శ్రీ సంజీవ్ దేవ్ గారి అభిప్రాయాలు-2


మొక్కల సంగీతం వినడం ఒక కళ. మనుష్యుల  సంగీతం మాత్రమే వినడానికి అలవాటైన చెవులకు మొక్కల సంగీతం వినిపించదు. అసలు మొక్కల సంగీతం చెవులకు వినిపించనే వినిపించదు. ఆ సంగీతంలో శబ్దం వుండదు. అది నిశ్శబ్ద సంగీతం. అందువల్ల ఆ సంగీతం చెవులకు వినిపించక కళ్ళకు మాత్రమే వినిపిస్తుంది. మొక్కల సంగీతం కనుకనే, దృశ్య సంగీతం కాని, శ్రవ్య సంగీతం కాదు.  మొక్కల సంగీతం అంటే పూవుల  సంగీతం కూడా అనే అర్ధం. పూవులు కూడా మొక్కకు ఉంటేనే అందం. మొక్కనుంచి తెంచితే పూవుల అందం పోతుంది. పూవులు లేకపోయినా మొక్క అందం పోదు. మొక్కను నాటింది మొదలు నిత్యం అది పెరుగుతుండదాన్ని గమనించడం ఒక ఆనందం. కొన్ని రోజులకొక నవ పల్లవం ప్రత్యక్షమౌతుంటే మన హృదయం వికసిస్తూ ఉంటుంది. 


వెన్నెల రాత్రులలో దూరం నుంచి నది మీదుగా వినిపించే వేణువు సంగీతం, వెన్నెల తగలని చీకటి ప్రదేశాలను కూడా వెన్నెలతో నింపుతుంది.

స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.

Tuesday, August 13, 2013

సంగీతము-సాహిత్యము

సంగీతము-సాహిత్యము ల పై శ్రీ సంజీవ్ దేవ్ గారి అభిప్రాయాలు 

సంగీత కళల కంటే సాహిత్య కళలు ఎక్కువగా మేధ కు సంబంధించినవి. చిత్ర కళా, సంగీత కళలు ఎక్కువగా హృదయానికి సంబంధించినవి. సాహిత్య కళలలో ఆలోచన కూడా అవసరం, మిగతావాటిలో అనుభూతి ప్రధానం. సాహిత్యం లో ఆలోచన, సంగీతం లో అనుభూతి ప్రధానం. కనుకనే లాక్షణికులు అన్నారు !
             సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్తనద్వయమ్ 
             ఏక మాపాతమధురం అన్యదాలోచనామృతమ్ 
సంగీత సాహిత్యాలు రెండూ  సరస్వతి కి రెండు స్తనాలట. ఒకటి వెంటనే మధురమట, రెండవది ఆలోచన తో కూడుకున్న అమృతమట. 
అవును సంగీతం వింటున్నప్పుడు హృదయము తప్ప మేధ పనిచేయవలసిన అవసరం వుండదు. సాహిత్యం చదువుతున్నప్పుడు  ప్రధానంగా పనిచేసేది మేధ. ఆలోచన లేని సాహిత్యమూ, అనుభూతి లేని సంగీతమూ ఉత్తమ కళలు కావు.  సంగీతం లో నాదానికి ప్రాధాన్యమే కాని అర్ధానికి కాదు. సాహిత్యం లో అర్ధానికి ప్రాధాన్యమే కాని నాదానికి కాదు. అందుకే సంగీతాన్ని అందరూ ఆనందిస్తారు కానీ సాహిత్యాన్ని అందరూ ఆనందించలేరు.
సంగీత సంగతి జాడ తెలిస్తేనే కాని సాహిత్యం సంగతి కూడా తెలిసినట్టు కాదు. సాహిత్యంలో విషయ పరిజ్ఞానం కూడా అవసరం. సంగీతంలో సునాద సృష్టి మాత్రమే ప్రధానం.
           స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.  

Wednesday, August 7, 2013

సంగీతం

It is the silence in between the notes
that make the music
                                        Noah Ben Shea, in Jacob the Baker,
                                        Quoted in ‘Pouring your Heart into it’.

రాగచ్ఛాయలు, వాటి మధ్య ఉండే నిశ్శబ్దం కలిసి సంగీతం అవుతుంది 

I am the rest between two notes;
.... in that dark pause, trembling,
The notes meet, harmonious;
And the Song continues Sweet.
                                      Rilkey, German Philosopher
రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతి నేను. ఆ క్షణిక విరామంలో, వణికిపోతూ, కలియవచ్చిన  ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది.


Thursday, August 1, 2013

సంగీతం

Music is the Wisdom of the heart
హృదయంలోని వివేకమే సంగీతం 
                                                  Confucius

సత్యం, సౌందర్యాన్వేషణలలో నిమగ్నం కావడానికి 
సంగీతం ఉపకరిస్తుంది                 ఆరిష్టాటిల్ 

విద్యా విధానం లో సంగిత ప్రాధాన్యం ఎక్కువ గా ఉంటే 
అది వ్యక్తుల్ని సాత్విక స్వభావులు గాను ఉదాసినులను గాను తాయారు చేస్తుంది 
                                                            ప్లేటో, రిపబ్లిక్ 

సంగీతంలో శ్రావ్యత ని అందించే గుణం, శాస్త్ర జ్ఞానాన్ని ప్రదర్శించే గుణం రెండూ ఉన్నాయి 

సంగీతం అంటే ఆపాత మధురం