Saturday, June 11, 2011

శ్రవణ సంపుటాల పరిచయం


                                                   శ్రవణ సంపుటాల పరిచయం  

                            తెలుగులో భావగీతాలు, గజల్స్  లాంటివి ఎన్నో వస్తున్నాయి వాటిని ఔత్సాహికులు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవటం ద్వార మాత్రమే ప్రాచుర్యం పొందుతున్నాయి గాని అవి సంగీత ప్రియులందరికీ చేరడంలేదు.అలా మరుగునపడి ఉన్న భావ గీతాలు కొన్నింటిని సేకరించి అందరికీ అందుబాటులోనికి తేవటానికి    సాహితీ గౌతమి, రాజమoడ్రి సంకల్పించింది.

                            ప్రస్తుతం వెల్లువ, హరివిల్లు, విరిజల్లు  అనే మూడు ఆల్బంలను వెలువరిస్తున్నాము. వీటికి       ఓ.న్.జి.సి  ఢిల్లీ  వారు చేసిన ఆర్ధికసహాయం హర్షణీయం. మున్ముందు మరెన్నో భావగీతాల్ని తెలుగు వారికి అందించాలని మా ఆకాంక్ష .

                          ఈ ఆల్బంలలో భావాగీతాలతో పాటు తెలుగు గజల్స్ కూడా ఉన్నాయి .తెలుగు భాషలో వచ్చిన తొలి గజల్ శ్రీ దాశరథి గారి " రమ్మంటే చాలుగానీ". దీనిని పరిచయం చేయడం మాకు గర్వకారణం.

                          భావగీతాలలో గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని గీతాలకు ఒకటికంటె ఎక్కువ బాణీలున్నాయి. అలానే సాహిత్యంలో కూడా  స్వల్పమార్పులున్నట్టు  తెలుస్తోంది  . కానీ ఆయా గీతాల్ని మాకు వినిపించిన గాత్రంలో, వారికి తెలిసిన బాణీలలోనే, వారి దగ్గరున్న సాహిత్యంతోనే  ఈ అల్బంలను  చేశాం.

                         శ్రోతలు తమకు తెలిసిన భావగీతాలు, గజల్స్ లను సాహితీ గౌతమికి అందించగలిగితే వాటిని రాబోయే సంపుటాలలో పొందుపరచగలం.
                     
                        మా ఈ ప్రయత్నంతో తెలుగునాట ప్రతీ నోటా భావగీతాలు వెల్లువెత్తాలని మా ఆకాంక్ష .


                           స్వాగతం, భావగీతాల జల్లుల వెల్లువలో ఓలలాడండి ! 









2 comments:

manchi prayatname. konasaaginchandi. mee saahithi gowthami ki maa dhanyavaadaalu.

Yaamini Reddy garu
Saahiti gowtami blog chusinanduku meeku maa dhanya vaadamulu
mee mitra brundaaniki maa blog ni parichayam cheyamani maa vijnapti.
Tondaralo maro album teesuku raavadaaniki prayatnistunnam.
meeku telisina geetaalu unte maa to share cheyamani kudaa maa vijnapti.

P.Vijay Kumar
President, Saahiti gowtami

Post a Comment