Wednesday, June 8, 2011

రమ్మంటే చాలుగాని ( తెలుగు లో మొదటి గజల్ )

రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచి రానా 
నీ చిన్నినవ్వు కోసం స్వర్గాలు నడచి రానా  || ర ||

ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు 
ఎంతెంత దూరమైన ఇంకెంత దూరమైన 
బ్రతుకంతా నడచి రానా  || ర ||

కనులందు మంచులాగా కలలన్ని కరిగిపోగా 
కావేరి వోలె పొంగి కన్నీరు తుడిచి రానా   || ర ||

నీవున్న మేడగదికి నను చేరనీయరేమో 
జలతారు చీరగట్టి సిగపూలు ముడిచిరానా    || ర ||

                                                                    రచన : దాశరధి 
                                                                    సంగీతం : శ్రీ పి.ఏ.రాజు


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?orjebws065lpfoz


ఈ పాట గురించి మరింత సమాచారం కొరకు  

1 comments:

Post a Comment