Friday, October 4, 2013

కార్యక్రమాలు

సెప్టెంబర్ 20, 2013 న అనం రోటరీ హాల్ వై జంక్షన్ రాజమండ్రి లో సాయంత్రం 5:30 గంటలకు
హిందీ - తెలుగు రాష్ట్రీయ హాస్య కవి సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమం ONGC రాజమండ్రి వారి సౌజన్యం తో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి  అసెట్ మేనేజర్  శ్రీ PK రావు గారు. 
ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు కవి సమ్మేళనం నిర్వహించారు. 
పాల్గొన్న తెలుగు కవులు 
  డా. RS వెంకటేశ్వర రావు గారు, కొత్తపేట 
  PRL స్వామి గారు , యానాం 
  అద్దేపల్లి రామ్మోహన రావు, కాకినాడ 
  CBVRK శర్మ,రాజమండ్రి 
  ఖాదర్ ఖాన్,రాజమండ్రి 
  యర్రాప్రగడ  రామ కృష్ణ  రాజమండ్రి 
పాల్గొన్నహిందీ కవులు
  నరేంద్ర రాయ్, హైదరాబాద్ 
  వేణుగోపాల్ భట్టడ్, హైదరాబాద్
  పండిట్ రామ కృష్ణ పాండే హైదరాబాద్
  వహీద్ పాషా ఖాద్రీ హైదరాబాద్
  SP గంగిరెడ్డి,రాజమండ్రి 
  చేబోలు శేషగిరి రావు , రాజమండ్రి 
కార్యక్రమానికి హాజరయిన సుమారు 300 మంది శ్రోతలు కవుల్ని,వారి కవిత్వాన్ని హాయిగా నవ్వుతూ ఆనందించి నట్టు మరుసటి రోజు పత్రికలు కధనాల్ని ప్రచురించాయి 

Wednesday, September 18, 2013

ఆహ్వానం

హిందీ - తెలుగు రాష్ట్రీయ  హాస్య కవి సమ్మేళనం 

సాహితీ గౌతమి సెప్టెంబర్ 20, 2013 న    అనం రోటరీ హాల్ వై జంక్షన్  రాజమండ్రి లో సాయంత్రం 5:30 గంటలకు
హిందీ - తెలుగు రాష్ట్రీయ  హాస్య కవి సమ్మేళనం నిర్వహిస్తోంది. 

ఆహ్వాన  పత్రిక జత పరుస్తున్నాం వివరాలన్నీ ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే పత్రికలో ఇచిన నంబర్లకు కాల్ చేయండి 

అందరికి ఇదే మా ఆహ్వానం. బంధు మిత్ర సకుటుంబ సమేతంగా వచ్చి ఆనందించండి



Friday, September 13, 2013

ఆహ్వానం

హిందీ - తెలుగు రాష్ట్రీయ  హాస్య కవి సమ్మేళనం 

సాహితీ గౌతమి సెప్టెంబర్ 20, 2013 న    అనం రోటరీ హాల్ వై జంక్షన్  రాజమండ్రి లో సాయంత్రం 5:30 గంటలకు
హిందీ - తెలుగు రాష్ట్రీయ  హాస్య కవి సమ్మేళనం నిర్వహిస్తోంది. వివరాలు రెండు  రోజుల్లో 
అందరికి ఇదే మా ఆహ్వానం. బంధు మిత్ర సకుటుంబ సమేతంగా వచ్చి ఆనందించండి

Wednesday, August 14, 2013

గీతాంజలి తత్త్వం

 గీతాంజలి తత్త్వం 

రవీంద్రుని గీతాంజలి ఆంగ్లంలో వుంది. అసలు మాతృక బెంగాలిలో. చలంగారి గీతాంజలి ఆంధ్రంలో వుంది. భాషా పరివర్తనే కాని భావ పరివర్తన లేదు. నిప్పును ఏ భాషలో పిలిచినా కాలకుండా వుండదు. రవీంద్రుని వంగ గీతాంజలి ఛందోబద్ధమైన గీతాలు. రవీంద్రుని ఆంగ్ల గీతాంజలి  ఒక విధమైన లయమయ గద్య. ఛందోమయ రచనలు ధ్వని ప్రధానాలు. 

'మానవుడిలోని పరిమిత ప్రాణం విశ్వంలోని అపరిమిత ప్రాణాన్ని అందుకోడానికి నిరంతరం తహతహలాడుతూనే వుంటుంది. కొద్దిలో ఎన్నడూ  సంతృప్తి లేదు. పెద్దలోనే సంతృప్తి. "నాల్పే సుఖమస్తి భూమైవ సుఖమస్తి." కొద్దిలోనే సుఖాన్ని పొంది సంతృప్తి చెందితే ఇక సృష్టిలో పెరుగుదలేముంటుంది? అందుకే మానవప్రాణం మహాప్రాణాన్ని అందుకోవాలనే సతతాకాంక్ష. మానవప్రాణం మహాప్రాణాన్ని అందుకొనే నిమిత్తం మట్టిని వదలాల్సిన పనిలేదు. కారణం మట్టి  మహాప్రాణానికి విరోధమైంది కాదు. ఇంద్రియానుభూతి ద్వారానే మానవ ప్రాణం అతీంద్రియమైన మహాప్రాణాన్ని అందుకోగలదు. ఇందుకు పరంపరాగత మతాచారాలవసరం లేదు. ఇందుకు కావలసినది  మహా ప్రేమ. ఇదీ గీతాంజలి తత్త్వం." 

స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.

సంగీతము-సాహిత్యము

సంగీతము-సాహిత్యము ల పై శ్రీ సంజీవ్ దేవ్ గారి అభిప్రాయాలు-2


మొక్కల సంగీతం వినడం ఒక కళ. మనుష్యుల  సంగీతం మాత్రమే వినడానికి అలవాటైన చెవులకు మొక్కల సంగీతం వినిపించదు. అసలు మొక్కల సంగీతం చెవులకు వినిపించనే వినిపించదు. ఆ సంగీతంలో శబ్దం వుండదు. అది నిశ్శబ్ద సంగీతం. అందువల్ల ఆ సంగీతం చెవులకు వినిపించక కళ్ళకు మాత్రమే వినిపిస్తుంది. మొక్కల సంగీతం కనుకనే, దృశ్య సంగీతం కాని, శ్రవ్య సంగీతం కాదు.  మొక్కల సంగీతం అంటే పూవుల  సంగీతం కూడా అనే అర్ధం. పూవులు కూడా మొక్కకు ఉంటేనే అందం. మొక్కనుంచి తెంచితే పూవుల అందం పోతుంది. పూవులు లేకపోయినా మొక్క అందం పోదు. మొక్కను నాటింది మొదలు నిత్యం అది పెరుగుతుండదాన్ని గమనించడం ఒక ఆనందం. కొన్ని రోజులకొక నవ పల్లవం ప్రత్యక్షమౌతుంటే మన హృదయం వికసిస్తూ ఉంటుంది. 


వెన్నెల రాత్రులలో దూరం నుంచి నది మీదుగా వినిపించే వేణువు సంగీతం, వెన్నెల తగలని చీకటి ప్రదేశాలను కూడా వెన్నెలతో నింపుతుంది.

స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.

Tuesday, August 13, 2013

సంగీతము-సాహిత్యము

సంగీతము-సాహిత్యము ల పై శ్రీ సంజీవ్ దేవ్ గారి అభిప్రాయాలు 

సంగీత కళల కంటే సాహిత్య కళలు ఎక్కువగా మేధ కు సంబంధించినవి. చిత్ర కళా, సంగీత కళలు ఎక్కువగా హృదయానికి సంబంధించినవి. సాహిత్య కళలలో ఆలోచన కూడా అవసరం, మిగతావాటిలో అనుభూతి ప్రధానం. సాహిత్యం లో ఆలోచన, సంగీతం లో అనుభూతి ప్రధానం. కనుకనే లాక్షణికులు అన్నారు !
             సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్తనద్వయమ్ 
             ఏక మాపాతమధురం అన్యదాలోచనామృతమ్ 
సంగీత సాహిత్యాలు రెండూ  సరస్వతి కి రెండు స్తనాలట. ఒకటి వెంటనే మధురమట, రెండవది ఆలోచన తో కూడుకున్న అమృతమట. 
అవును సంగీతం వింటున్నప్పుడు హృదయము తప్ప మేధ పనిచేయవలసిన అవసరం వుండదు. సాహిత్యం చదువుతున్నప్పుడు  ప్రధానంగా పనిచేసేది మేధ. ఆలోచన లేని సాహిత్యమూ, అనుభూతి లేని సంగీతమూ ఉత్తమ కళలు కావు.  సంగీతం లో నాదానికి ప్రాధాన్యమే కాని అర్ధానికి కాదు. సాహిత్యం లో అర్ధానికి ప్రాధాన్యమే కాని నాదానికి కాదు. అందుకే సంగీతాన్ని అందరూ ఆనందిస్తారు కానీ సాహిత్యాన్ని అందరూ ఆనందించలేరు.
సంగీత సంగతి జాడ తెలిస్తేనే కాని సాహిత్యం సంగతి కూడా తెలిసినట్టు కాదు. సాహిత్యంలో విషయ పరిజ్ఞానం కూడా అవసరం. సంగీతంలో సునాద సృష్టి మాత్రమే ప్రధానం.
           స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.  

Wednesday, August 7, 2013

సంగీతం

It is the silence in between the notes
that make the music
                                        Noah Ben Shea, in Jacob the Baker,
                                        Quoted in ‘Pouring your Heart into it’.

రాగచ్ఛాయలు, వాటి మధ్య ఉండే నిశ్శబ్దం కలిసి సంగీతం అవుతుంది 

I am the rest between two notes;
.... in that dark pause, trembling,
The notes meet, harmonious;
And the Song continues Sweet.
                                      Rilkey, German Philosopher
రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతి నేను. ఆ క్షణిక విరామంలో, వణికిపోతూ, కలియవచ్చిన  ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది.


Thursday, August 1, 2013

సంగీతం

Music is the Wisdom of the heart
హృదయంలోని వివేకమే సంగీతం 
                                                  Confucius

సత్యం, సౌందర్యాన్వేషణలలో నిమగ్నం కావడానికి 
సంగీతం ఉపకరిస్తుంది                 ఆరిష్టాటిల్ 

విద్యా విధానం లో సంగిత ప్రాధాన్యం ఎక్కువ గా ఉంటే 
అది వ్యక్తుల్ని సాత్విక స్వభావులు గాను ఉదాసినులను గాను తాయారు చేస్తుంది 
                                                            ప్లేటో, రిపబ్లిక్ 

సంగీతంలో శ్రావ్యత ని అందించే గుణం, శాస్త్ర జ్ఞానాన్ని ప్రదర్శించే గుణం రెండూ ఉన్నాయి 

సంగీతం అంటే ఆపాత మధురం 

Friday, July 26, 2013

జ్ఞాపకం


అందమైన ప్రతి వస్తువూ నిన్నే జ్ఞాపకం జేస్తుంది! 
సున్నితమైన ప్రతి భావమూ నిన్నే జ్ఞాపకం జేస్తుంది!
ప్రాణమిచ్చే ప్రతి  ఊహలోనూ నీవే స్ఫురిస్తావు!!


ఈ మూడు లైన్ల కవితను ఆచంట జానకిరామ్ గారు ఎవరైనా వ్యక్తిని ఉద్దేశించి వ్రాశారో లేక ఏదైనా సౌందర్యాన్విత ఊహా పదార్ధాన్ని దృష్టి లో  పెట్టుకొని వ్రాశారో మనకు తెలియదు. దీనికి ఆయన తమ "నా స్మృతి పథంలో' గ్రంధం లో ముందు మాట వంటి స్థానాన్ని ఇచ్చుకున్నారు. 
 ఆచంట జానకిరామ్- జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు 2008 నుండి 

Tuesday, June 18, 2013

కార్యవర్గం

సలహాదారులు
  • డా॥ బేతవోలు రామబ్రహ్మం గారు 
  • డా॥ ఎండ్లూరి సుధాకర్ గారు 
  • డా॥ తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు 

అధ్యక్షులు        : శ్రీ  పి.విజయ్ కుమార్ గారు
ఉపాధ్యక్షులు     : శ్రీ ఎమ్ సూర్యనారయణ గారు
                        : శ్రీ ఎన్ జి శ్యాం సింగ్ గారు
కార్యదర్శి          : శ్రీ దినవహి బాపి రాజు గారు
సహకార్యదర్శి    : శ్రీ ఎన్ వి వి దుర్గారావు గారు
కోశాధికారి         : సి విజయ్ కుమార్ గారు
సభ్యులు           : శ్రీమతి పి నిర్మల గారు
                        శ్రీమతి పుట్ల హేమలత గారు
                        శ్రీ సి హెచ్ సూర్య ప్రకాశ రావు గారు
                        శ్రీ ఎన్ ఎన్ రావు గారు
                        శ్రీ కే ఆర్ జోగేశ్వర రావు గారు

Monday, June 17, 2013

మా కార్యక్రమములు


24-8-1999 న సాహితీ గౌతమి మొదటి కార్యక్రమం, శ్రీ కొంపెల్ల రామకృష్ణ మూర్తి గారి కవితా సంపుటి " వెన్నెలలో వడగాల్పులు " ఆవిష్కరణ.

తరువాత కొన్ని సాహితీ ప్రసంగ కార్యక్రమాలు జరిగాయి. 2003 లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, స్థానాంతరణ పై రాజమండ్రి వదలి వెళ్ళిపోగా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. తిరిగి 2010 లో సాహితీ గౌతమి కొత్త బలాన్ని పుంజుకుంది.

4-11-2010 న, భావ గీతాల శ్రవణ సంపుటి, " వెల్లువ ", లెఫ్టినెంట్ జాస్తి మూర్తి గారు ఆవిష్కరించారు.

5-12-2010న రాజమండ్రి లో పేరెన్నిక గన్న కవి, రచయిత కీ||శే|| స్మైల్ గారి రెండవ వర్ధంతి " స్మైల్ జ్ఞాపకాల సాయంత్రం" లో శ్రీ కోడూరి శ్రీ రామమూర్తి గారు స్మైల్ గారి ఖాళీసీసాల కథ, మరి కొన్ని కథలను విశ్లేషించారు. స్మైల్ గారి సన్నిహితులు శ్రీ వెలమాటి సత్యం గారు, డా॥ సాగర్ గారు ప్రసంగించారు. సభకు శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు అధ్యక్షత వహించారు.

17-12-2010 న శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి " నా సాహితీ యాత్ర " సాహిత్య ప్రసంగం

30-05-2011 న మరో రెండు భావ గీతాల శ్రవణ సంపుటాలు " హరివిల్లు, విరిజల్లు " లను రాజమండ్రి లోక్ సభ సభ్యులు గౌ||శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ రౌతు సూర్య ప్రకాశరావు గారు, లెఫ్టినెంట్ జాస్తి మూర్తి గార్లు ఆవిష్కరించారు.

23-11-2012 తేదీన కీ॥శే॥ కందుకూరి వీరేశలింగం రచనలు, సాహిత్య సేవ సభలో శ్రీ వై.ఎస్.నరసింహారావు
( వ్యవస్థాపకులు, ఆంధ్రకేసరి యువజన సమితి, రాజమండ్రి ) ప్రసంగించగా,ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ( పీఠాధిపతి, తెలుగు విశ్వవిద్యాలయం ) అధ్యక్షత వహించారు.

24-11-2012 తేదీన ఆదికవి నన్నయ కవిత్వ సభ లో శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు ( ప్రిన్సిపాల్, ప్రభుత్వ కళాశాల, కొత్తపేట ) మరియు డా॥ శ్రీమతి వెలువోలు నాగరాజ్యలక్ష్మి ( ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా కళాశాల, ఒంగోలు ) ప్రసంగించగా, ఈ కార్యక్రమానికి శ్రీ ఎస్.పి.గంగిరెడ్డి ( ఇ.సి.సభ్యులు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ) అధ్యక్షత వహించారు.

25-11-2012 నక్ష వీక్షకులకు బుక్ హంట్ నిర్వహించాం.

26-11-2012 న వాక్ ఫర్ బుక్స్ ( దేవీచౌక్ నుండి సుబ్రహ్మణ్య మైదానం వరకు నన్నయ విశ్వవిద్యాలయ కులపతి శ్రీ జార్జ్ విక్టర్, ఎమెస్కో విజయ కుమార్ గార్ల నేతృత్వంలో వాక్ ఫర్ బుక్ నిర్వహించబడింది తదనంతరం ప్రముఖ మనోవికాస విజ్ఞాన నిపుణులు శ్రీ బి.వి.పట్టాభిరామ్ గారు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం, డిగ్రీ, పీజి విద్యార్థులకు కథా విశ్లేషణ పోటి నిర్వహించాం. )

27-11-2012 తేదీన శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య సభ లో డా॥ శ్రీమతి కె.ఎన్.మల్లీశ్వరి ( తెలుగు విభాగ అధిపతి, ఆదిత్య పి.జి.కళాశాల, విశాఖపట్నం ), శ్రీ నండూరి రాజగోపాల్ ( సంపాదకులు, చినుకు మాసపత్రిక, విజయవాడ ) ప్రసంగించగా, శ్రీ యర్రా ప్రగడ రామకృష్ణ ( సాహితీవేత్త, వ్యాస రచయిత, రాజమండ్రి ) అధ్యక్షత వహించారు.

ఈ సభలో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు వ్రాసిన " ఆకులో ఆకునై " పుస్తకాన్ని శ్రీ తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు ఆవిష్కరించారు.

28-11-2012 న శ్రీ శ్రీ కవితల కంఠస్థ పోటీ లో, శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం నుండి కవితా ఓ కవితా అను కవితలను స్కూలు విద్యార్థులు వల్లించగా , డిగ్రీ,- పీజి విద్యార్థులకు కవితా రచన పోటీ నిర్వహించారు

29-11-2012 న వ్యాస రచన పోటీలు స్కూలు విద్యార్థులకు మరియు డిగ్రీ, పీజి విద్యార్థులకు వేరు వేరు విభాగాలలో నిర్వహించారు

30-11-2012 న విజ్యువల్ క్విజ్ ను, డిగ్రీ - పీజి విద్యార్థులను మరియు ప్రేక్షకులను ఉద్దేశించి డా॥ వై అశోక్ (అసోసియేట్ ప్రొఫెసర్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ ) వారి అధ్యక్షతన నిర్వహించారు.

01-12-2012 న మహాకవి గురజాడ వర్ధంతి సభ లో శ్రీ యు.ఎ.నరసింహమూర్తి ( విశ్రాంత తెలుగు అధ్యాపకులు, విజయనగరం ), డా॥ శ్రీమతి అయ్యగారి సీతారత్నం (తెలుగు విభాగ అధిపతి, ఎ.వి.ఎన్ కళాశాల, విశాఖపట్నం ) ప్రసంగించగా, శ్రీ తల్లావఝుల పతంజలి శాస్త్రి (కథా రచయిత, పర్యావరణ నిపుణులు, రాజమండ్రి) అధ్యక్షత వహించారు.

20-12-2012 న గిడుగు రాజేశ్వర రావు గారి " సృష్టిలో మధురిమలు - సప్తవర్ణ దృశ్యకావ్యం " పరిచయ సభ.

24-2-2013 న " అమ్మ చెట్టు " పుస్తక ఆవిష్కరణ సభ లో శ్రీ కోడూరి శ్రీ రామమూర్తి గారి అధ్యక్షతన శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు అమ్మ చెట్టు పుస్తకాన్ని ఆవిష్కరించారు, శ్రీమతి కమలా నెహ్రు గారు "అమ్మ చెట్టు" పుస్తకాన్ని స్వీకరించారు. డా॥ ఎండ్లూరి సుధాకర్, డా॥ శ్రీమతి పాలంకి శోభా రాణి, డా॥ శ్రీమతి పుట్ల హేమలత, శ్రీ తల్లావఝుల పతంజలి శాస్త్రి గార్లు పుస్తకాన్ని పరిచయం చేసారు.

20-9-2013న  అనం రోటరీ హాల్ వై జంక్షన్ రాజమండ్రి లో సాయంత్రం 5:30 గంటలకు
హిందీ - తెలుగు రాష్ట్రీయ హాస్య కవి సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమం ONGC రాజమండ్రి వారి సౌజన్యం తో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి  అసెట్ మేనేజర్  శ్రీ PK రావు గారు. 
ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు కవి సమ్మేళనం నిర్వహించారు. 
తెలుగు కవులు   డా. RS వెంకటేశ్వర రావు గారు, కొత్తపేట, శ్రీ  PRL స్వామి గారు , యానాం , శ్రీ   అద్దేపల్లి రామ్మోహన రావు, కాకినాడ, శ్రీ CBVRK శర్మ,రాజమండ్రి,శ్రీ ఖాదర్ ఖాన్,రాజమండ్రి,శ్రీ యర్రాప్రగడ  రామ కృష్ణ  రాజమండ్రి. హిందీ కవులు శ్రీ నరేంద్ర రాయ్, హైదరాబాద్, శ్రీ వేణుగోపాల్ భట్టడ్, హైదరాబాద్, పండిట్ రామ కృష్ణ పాండే హైదరాబాద్, శ్రీ వహీద్ పాషా ఖాద్రీ హైదరాబాద్, శ్రీ SP గంగిరెడ్డి,రాజమండ్రి, శ్రీ చేబోలు శేషగిరి రావు , రాజమండ్రి.  
కార్యక్రమానికి హాజరయిన సుమారు 300 మంది శ్రోతలు కవుల్ని,వారి కవిత్వాన్ని హాయిగా నవ్వుతూ ఆనందించి నట్టు మరుసటి రోజు పత్రికలు కధనాల్ని ప్రచురించాయి.

21-9-2013 న కాకినాడ ONGC లో కూడా హిందీ కవి సమ్మేళనం నిర్వహించాం. 

24-11-2013 న హోటల్ రివర్ బే లో  తానా అంతర్జాల తెలుగు పత్రికా సంపాదకులు, డెట్రాయిట్, అమెరికా  వారు రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ వేదిక -సాహితీ సౌరభాలు కార్యక్రమాన్ని ONGC సరస్వతి గారి సౌజన్యం తో నిర్వహించాము.