Tuesday, August 13, 2013

సంగీతము-సాహిత్యము

సంగీతము-సాహిత్యము ల పై శ్రీ సంజీవ్ దేవ్ గారి అభిప్రాయాలు 

సంగీత కళల కంటే సాహిత్య కళలు ఎక్కువగా మేధ కు సంబంధించినవి. చిత్ర కళా, సంగీత కళలు ఎక్కువగా హృదయానికి సంబంధించినవి. సాహిత్య కళలలో ఆలోచన కూడా అవసరం, మిగతావాటిలో అనుభూతి ప్రధానం. సాహిత్యం లో ఆలోచన, సంగీతం లో అనుభూతి ప్రధానం. కనుకనే లాక్షణికులు అన్నారు !
             సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్తనద్వయమ్ 
             ఏక మాపాతమధురం అన్యదాలోచనామృతమ్ 
సంగీత సాహిత్యాలు రెండూ  సరస్వతి కి రెండు స్తనాలట. ఒకటి వెంటనే మధురమట, రెండవది ఆలోచన తో కూడుకున్న అమృతమట. 
అవును సంగీతం వింటున్నప్పుడు హృదయము తప్ప మేధ పనిచేయవలసిన అవసరం వుండదు. సాహిత్యం చదువుతున్నప్పుడు  ప్రధానంగా పనిచేసేది మేధ. ఆలోచన లేని సాహిత్యమూ, అనుభూతి లేని సంగీతమూ ఉత్తమ కళలు కావు.  సంగీతం లో నాదానికి ప్రాధాన్యమే కాని అర్ధానికి కాదు. సాహిత్యం లో అర్ధానికి ప్రాధాన్యమే కాని నాదానికి కాదు. అందుకే సంగీతాన్ని అందరూ ఆనందిస్తారు కానీ సాహిత్యాన్ని అందరూ ఆనందించలేరు.
సంగీత సంగతి జాడ తెలిస్తేనే కాని సాహిత్యం సంగతి కూడా తెలిసినట్టు కాదు. సాహిత్యంలో విషయ పరిజ్ఞానం కూడా అవసరం. సంగీతంలో సునాద సృష్టి మాత్రమే ప్రధానం.
           స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.  

0 comments:

Post a Comment