Wednesday, August 14, 2013

గీతాంజలి తత్త్వం

 గీతాంజలి తత్త్వం 

రవీంద్రుని గీతాంజలి ఆంగ్లంలో వుంది. అసలు మాతృక బెంగాలిలో. చలంగారి గీతాంజలి ఆంధ్రంలో వుంది. భాషా పరివర్తనే కాని భావ పరివర్తన లేదు. నిప్పును ఏ భాషలో పిలిచినా కాలకుండా వుండదు. రవీంద్రుని వంగ గీతాంజలి ఛందోబద్ధమైన గీతాలు. రవీంద్రుని ఆంగ్ల గీతాంజలి  ఒక విధమైన లయమయ గద్య. ఛందోమయ రచనలు ధ్వని ప్రధానాలు. 

'మానవుడిలోని పరిమిత ప్రాణం విశ్వంలోని అపరిమిత ప్రాణాన్ని అందుకోడానికి నిరంతరం తహతహలాడుతూనే వుంటుంది. కొద్దిలో ఎన్నడూ  సంతృప్తి లేదు. పెద్దలోనే సంతృప్తి. "నాల్పే సుఖమస్తి భూమైవ సుఖమస్తి." కొద్దిలోనే సుఖాన్ని పొంది సంతృప్తి చెందితే ఇక సృష్టిలో పెరుగుదలేముంటుంది? అందుకే మానవప్రాణం మహాప్రాణాన్ని అందుకోవాలనే సతతాకాంక్ష. మానవప్రాణం మహాప్రాణాన్ని అందుకొనే నిమిత్తం మట్టిని వదలాల్సిన పనిలేదు. కారణం మట్టి  మహాప్రాణానికి విరోధమైంది కాదు. ఇంద్రియానుభూతి ద్వారానే మానవ ప్రాణం అతీంద్రియమైన మహాప్రాణాన్ని అందుకోగలదు. ఇందుకు పరంపరాగత మతాచారాలవసరం లేదు. ఇందుకు కావలసినది  మహా ప్రేమ. ఇదీ గీతాంజలి తత్త్వం." 

స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.

0 comments:

Post a Comment