సంగీతము-సాహిత్యము ల పై శ్రీ సంజీవ్ దేవ్ గారి అభిప్రాయాలు-2
మొక్కల సంగీతం వినడం ఒక కళ. మనుష్యుల సంగీతం మాత్రమే వినడానికి అలవాటైన చెవులకు మొక్కల సంగీతం వినిపించదు. అసలు మొక్కల సంగీతం చెవులకు వినిపించనే వినిపించదు. ఆ సంగీతంలో శబ్దం వుండదు. అది నిశ్శబ్ద సంగీతం. అందువల్ల ఆ సంగీతం చెవులకు వినిపించక కళ్ళకు మాత్రమే వినిపిస్తుంది. మొక్కల సంగీతం కనుకనే, దృశ్య సంగీతం కాని, శ్రవ్య సంగీతం కాదు. మొక్కల సంగీతం అంటే పూవుల సంగీతం కూడా అనే అర్ధం. పూవులు కూడా మొక్కకు ఉంటేనే అందం. మొక్కనుంచి తెంచితే పూవుల అందం పోతుంది. పూవులు లేకపోయినా మొక్క అందం పోదు. మొక్కను నాటింది మొదలు నిత్యం అది పెరుగుతుండదాన్ని గమనించడం ఒక ఆనందం. కొన్ని రోజులకొక నవ పల్లవం ప్రత్యక్షమౌతుంటే మన హృదయం వికసిస్తూ ఉంటుంది.
వెన్నెల రాత్రులలో దూరం నుంచి నది మీదుగా వినిపించే వేణువు సంగీతం, వెన్నెల తగలని చీకటి ప్రదేశాలను కూడా వెన్నెలతో నింపుతుంది.
వెన్నెల రాత్రులలో దూరం నుంచి నది మీదుగా వినిపించే వేణువు సంగీతం, వెన్నెల తగలని చీకటి ప్రదేశాలను కూడా వెన్నెలతో నింపుతుంది.
స్మృతిబింబాలు, తుమ్మపూడి, సంజీవ్ దేవ్ స్వీయ చరిత్ర, రాజాచంద్ర ఫౌండేషన్,2011.
1 comments:
nice...
trendingandhra
Post a Comment