Sunday, February 16, 2014



భావగీతాల / లలితగీతాల పోటీలు

సాహితీ గౌతమి, రాజమండ్రి ఆధ్వర్యములో ఆదివారం 16-2-2014 న  ఆదిత్య డిగ్రీ కళాశాల లో లలితగీతాలు / భావగీతాల తుది  విడత పోటీలు  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గేయరచయిత, స్వరకర్త  శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు, ఆయన ప్రసంగిస్తూ లలిత గీతాలంటే నాదస్పర్శతో రాగరంజితాలైన భావగీతాలు, సుతారంగా చెవులకు సోకి సున్నితంగా మనసు పొరలను మీటి ఒక అందమైన భావోద్వేగానికి శ్రోతను తీసుకు వెళ్ళే రచన - స్వరరచన. లలితా గీతానికి  స్వేఛ్చ ఎక్కువ. సాంప్రదాయ సంగీతం తాలూకు నియమ నిబంధన సంకెళ్ళు లేని  స్వేఛ్చా విహంగం - లలితా గీతం. సంగీత వ్యాకరణాన్ని గౌరవిస్తూనే అన్ని రకాల సంగీత సాంప్రదాయాలనూ కలబోసుకొని భావ ప్రాధాన్యతతో సాగేదే లలిత గీతం . ఒక రకంగా సినిమా పాటలు కూడా లలితా గీతాలే, అయితే  - సినిమా పాటల్లో భావం సన్నివేశ ప్రధానంగా ఉంటుంది. తదనుగుణంగా అనేక వాయిద్యాలను సన్నివేశం ఇనుమడించే విధంగా ఉపయోగిస్తారు. అంతే తేడా. 

కొన్ని అన్నమయ్య సంకీర్తనలు రచనా పరంగా లలిత గీతాల్లా అనిపించినా ఎంతో కఠినమైన యతిప్రాసననుసరించి చేసిన రచనలనీ , త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షిత్లాల్ కీర్తనల మాదిరిగా అన్నమయ్య సంకీర్తన  నోటేషన్  దొరక్కపోవటం వల్ల కొందరు గాయకులు  తమకు చేతనైన  విధంగా వాటిని స్వరపరచి పాడుతున్నారని. శ్రీ నేదునూరి. కృష్ణ మూర్తి గారు, అన్నమయ్య కీర్తనలను, రాగాలాపన, స్వరకల్పన, నెరవలతో కచేరీలు చేసి వాటిని వాగ్గేయకారుల కీర్తనల సరసన నిలిపే  హోదానుకల్పించారు. 

బాలకృష్ణ ప్రసాద్, స్వరపరచి గానం చేసిన సంకీర్తనలు లలితంగా ధ్వనించినా, స్వరపరచి పాడడంలో శాస్త్రీయతను కొల్పో లేదు . కేవలం భక్తిరస ప్రధానమైన ఈ రచనలను లలిత సంగీతంతో జోడించడం సబబు కాదనీ, కొన్ని జానపద బాణీలను అనుసరించి రచనచేసి ఉండవచ్చని అన్నారు. 

శ్రీ కృష్ణ మోహన్ గారిని ఆదిత్యా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గంగి రెడ్డి గారు శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు. తదనంతరం విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది.  పోటీ జరిగిన సీనియర్ , జూనియర్ విభాగాలలో విజేతలకు ప్రధమ బహుమతిగా రెండు వేల  రూపాయల నగదు,ద్వితీయ బహుమతిగా పదిహేను వందల రూపాయల నగదు, తృతీయ బహుమతిగా వెయ్యి రూపాయలు మరియు వాటితోపాటు  అభినందన పత్రాలు, జ్ఞాపికలను సాహితీ గౌతమి వారు అందించి విజేతలను ప్రోత్సహించారు. అదే విధంగా పోటీలలో పాల్గొన్న  మిగతా పోటీదారులకు ధ్రువపత్రాలు అందజేశారు.

విభాగాల వారీగా బహుమతులు అందుకున్నవారు ఇలా ఉన్నరు 

సీనియర్ విభాగంలో -  ప్రధమ బహుమతి శ్రీ రామా ప్రియ (60), ద్వితీయ బహుమతి శ్రీ పి. వీర్రాజు గారు(50) గెలుచుకున్నరు. 

జూనియర్స్ విభాగంలో -  ప్రధమ బహుమతి  కుమారి ఎన్. నవ్య ప్రవల్లిక, ద్వితీయ బహుమతి బి. పూర్ణిమ, తృతీయ బహుమతి శ్రీ పి.వి.ఎల్.ఎన్.మూర్తి గెలుపొందగా, సీహెచ్. వీర గణేష్ కన్సోలేషన్ అందుకున్నారు. 

ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారు మరియు పలువురు గాయకులు కొన్ని భావగీతాలను ప్రేక్షకుల కొరకు పాడి వారిని రంజింపచేసారు.  

ఈ తరహ పోటీలను అతి త్వరలో మరలా రాజమండ్రిలో  నిర్వహిస్తామని సాహితీ గౌతమి  అధ్యక్షులు శ్రీ పి. విజయ్ కుమార్ గారు  అన్నారు మరియు ఉపాధ్యక్షులు చేవూరి. విజయ కుమార్ గారు వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. 

సాహితీ గౌతమి ఇలాటి  మరెన్నో సాహితీ కార్యక్రమాలు చెయ్యాలని హాజరైన అందరూ మనసారా అభిలషించారు.    


కార్యక్రమంలో తీసిన కొన్ని చిత్రాలు మీకోసం:





కార్యక్రమానికి న్యాయనిర్ణేతలు 


వందన సమర్పణలో ఉప్పద్యక్షులు శ్రీ చేవూరి . విజయ కుమార్ గారు  







ముఖ్య అతిధి శ్రీ కలగా కృష్ణ మోహన్ గారికి చిరు సత్కారం


Saturday, February 15, 2014

16-2-2014 న ఆదిత్య డిగ్రీ కళాశాల లో సాయంత్రం 3 గంటలకు 
సాహితీ గౌతమి లలిత గీతాలు/భావ గీతాల తుది పోటీ  నిర్వహిస్తోంది 
ఆ తర్వాత 6 గంటలకు  బహుమతి ప్రదానోత్సవం  ఉంటుంది 
గేయ కర్త, స్వర కర్త , ఆకాశ వాణి హైదరాబాద్ అధికారి శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు, ముఖ్య అతిధి
అందరూ వచ్చి లలిత గీతాలను విని ఆనందించండి 

పి.విజయ్ కుమార్ 
అధ్యక్షులు 
సాహితీ గౌతమి

Friday, February 14, 2014

కథా రచయిత శ్రీ దాసరి. అమరేంద్ర గారితో ఓ సాయంత్రం
సాహితీ గౌతమి, రాజమండ్రి ఆధ్వర్యములో శుక్రవారం 14-2-2014 న  ఆదిత్య డిగ్రీ కళాశాల లో కధా రచయిత శ్రీ దాసరి. అమరేంద్ర గారితో ఓ సాయంత్రం  అనే కార్యక్రమం జరిగింది. సభకు శ్రీ ఎండ్లూరి. సుధాకర్ గారు అధ్యక్షత వహించారు.  సాహితీ గౌతమి అధ్యక్షులు శ్రీ పి. విజయ్ కుమార్ సభికులకు ఆహ్వానం పలికారు , అమరేంద్ర  గారిని శ్రీ  డి ఆర్ ఇంద్ర పరిచయం చేశారు.
శ్రీ ఎండ్లూరి. సుధాకర్ గారు తన అధ్యక్షోపన్యాసం లో తెలుగు సాహిత్యంలో అమరేంద్రది  ఒక ప్రత్యేక పాత్ర. ప్రవాసాంధ్ర రచయితగా తెలుగు పాఠకులకు  సుపరిచితులు  ప్రధానంగా ఆయన యాత్రికుడు. నలుగురు మిత్రులతో ఢిల్లీ నుంచి కులూ , మనాలీ వెళ్లడం  రోహతాంగ్  యాత్ర  చేయడమే కాకుండా యూరోప్  లాంటి దేశాలను చుట్టి రావడం , ఆ అనుభవాలను పత్రికా ముఖంగా ప్రకటించడం , దాసరి అమరేంద్ర గారి విశిష్టత , ఆయన శేఫాలిక కథా సంప్రతి తో ప్రాచుర్యం పొందారు. వివిధ భారతీయ భాషలు, ఆంగ్లంలోంచి, అనువాద కథలను తెలుగు వారికి పరిచయం చేశారు.    
 
శ్రీ దాసరి. అమరేంద్ర  తను రెండు సంపుటాలుగా-ఆత్మీయమ్,సాహితీ యాత్ర- ప్రచురించిన కధల్లోని విషయాలను విపులీకరించారు. ఓ  సాహితీ కార్యకర్త గా తానూ డిల్లీ, పూణే, బెంగుళూరు లలో పాల్గొన్న సాహితి కర్యక్రమాలు, అవి చేకూర్చిన ప్రయోజనాల్ని వివరించారు. 
అయన ప్రసంగం తర్వాత ఇష్టా గోష్ఠి జరిగింది. 

సభకు హాజరైన వారిలో రాజమండ్రి కధా రచయితలు సర్వశ్రీ తల్లావఝుల పతంజలి శాస్త్రి, మహీధర రామ శాస్త్రి, కోడూరి  శ్రీరామ మూర్తి, ముప్పిడి ప్రభాకర రావు, సాహితీ  ప్రేమికులు యర్రాప్రగడ రామకృష్ణ, కూర్మయ్య, వెలమాటి సత్యం, డా॥ చైతన్య శేఖర్, అరిపిరాల నారాయణ రావు, ONGC సరస్వతి, డా॥ పి.ఎస్.ఆర్. మూర్తి, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు కమలా నెహ్రూ, ఉపాధ్యక్షులు సునంద ప్రభ్రుతులు పాల్గొన్నారు. 





Thursday, February 13, 2014


సాహితీ మితృలకు 
సాహితీ గౌతమి, రాజమండ్రి 
 ఆహ్వానం
కధా రచయిత శ్రీ దాసరి అమరేంద్ర గారితో ఓ సాయంత్రం 
14-2-2014 సాయంత్రం 6 గంటలకు ఆదిత్య డిగ్రీ కళాశాల 
(RTC కాంప్లెక్స్ దగ్గర). అందరికీ  ఆహ్వానం

పి. విజయ్ కుమార్ 
అధ్యక్షులు, సాహితీ గౌతమి

Tuesday, February 11, 2014

సా హితీ గౌతమి, రాజమండ్రి లలిత గీతాలు /భావ గీతాల పోటీ 9-2-2014 న నిర్వహించింది 

పోటీ కి 21మంది పోటీ దారులు హాజరయ్యారు. పందొమ్మిదేళ్ళ వయస్సు నుండి అరవైయ్యేళ్ల వయస్సుల  వారు  పోటీ పడ్డారు 

తొలి  విడత పోటీలో సీనియర్ల నుండి నలుగుర్ని, జూనియర్ల నుండి పది మందిని న్యాయ నిర్ణేతలు తుది పోటీ కి ఎంపిక చేసారు. 

వారు 16-2-2014 న తుది పోటిలో పాల్గొంటారు 

పోటీ సమయంలో తీసిన కొన్ని ఛాయా చిత్రాలు మీకోసం 












  

Saturday, February 1, 2014

లలిత గీతాలు /భావ గీతాల పోటీ

మితృలారా
సా హితీ గౌతమి, రాజమండ్రి లలిత గీతాలు /భావ గీతాల పోటీ 9-2-2014 న నిర్వాహిస్తోంది 
వివరాలు జతపరచిన పోస్టర్ లో చూడండి 
మీకు తెలిసిన గాయకులను పోటీలోపాల్గొనే లా ప్రోత్సహించ మనవి.
వీలయితే మీరు కూడా వచ్చి పోటీ దారులు పాడే పాటలు విని ఆనందించండి 
16-2-2014న ఫైనల్ పోటీ , బహుమతి ప్రదానం చేయడానికి సభ ఉన్నాయి. 
దీనికి తప్పక హాజరు కావాలని మా మనవి

Photo: మితృలారా
సా హితీ గౌతమి, రాజమండ్రి లలిత గీతాలు /భావ గీతాల పోటీ 9-2-2014 న నిర్వాహిస్తోంది 
వివరాలు జతపరచిన పోస్టర్ లో చూడండి 
మీకు తెలిసిన గాయకులను పోటీలోపాల్గొనే లా ప్రోత్సహించ మనవి.
వీలయితే మీరు కూడా వచ్చి పోటీ దారులు పాడే పాటలు విని ఆనందించండి 
16-2-2014న ఫైనల్ పోటీ , బహుమతి ప్రదానం చేయడానికి సభ ఉన్నాయి. 
దీనికి తప్పక హాజరు కావాలని మా మనవి