కథా రచయిత శ్రీ దాసరి. అమరేంద్ర గారితో ఓ సాయంత్రం
సాహితీ గౌతమి, రాజమండ్రి ఆధ్వర్యములో శుక్రవారం 14-2-2014 న ఆదిత్య డిగ్రీ కళాశాల లో కధా రచయిత శ్రీ దాసరి. అమరేంద్ర గారితో ఓ సాయంత్రం అనే కార్యక్రమం జరిగింది. సభకు శ్రీ ఎండ్లూరి. సుధాకర్ గారు అధ్యక్షత వహించారు. సాహితీ గౌతమి అధ్యక్షులు శ్రీ పి. విజయ్ కుమార్ సభికులకు ఆహ్వానం పలికారు , అమరేంద్ర గారిని శ్రీ డి ఆర్ ఇంద్ర పరిచయం చేశారు.
శ్రీ ఎండ్లూరి. సుధాకర్ గారు తన అధ్యక్షోపన్యాసం లో తెలుగు సాహిత్యంలో అమరేంద్రది ఒక ప్రత్యేక పాత్ర. ప్రవాసాంధ్ర రచయితగా తెలుగు పాఠకులకు సుపరిచితులు ప్రధానంగా ఆయన యాత్రికుడు. నలుగురు మిత్రులతో ఢిల్లీ నుంచి కులూ , మనాలీ వెళ్లడం రోహతాంగ్ యాత్ర చేయడమే కాకుండా యూరోప్ లాంటి దేశాలను చుట్టి రావడం , ఆ అనుభవాలను పత్రికా ముఖంగా ప్రకటించడం , దాసరి అమరేంద్ర గారి విశిష్టత , ఆయన శేఫాలిక కథా సంప్రతి తో ప్రాచుర్యం పొందారు. వివిధ భారతీయ భాషలు, ఆంగ్లంలోంచి, అనువాద కథలను తెలుగు వారికి పరిచయం చేశారు.
శ్రీ దాసరి. అమరేంద్ర తను రెండు సంపుటాలుగా-ఆత్మీయమ్,సాహితీ యాత్ర- ప్రచురించిన కధల్లోని విషయాలను విపులీకరించారు. ఓ సాహితీ కార్యకర్త గా తానూ డిల్లీ, పూణే, బెంగుళూరు లలో పాల్గొన్న సాహితి కర్యక్రమాలు, అవి చేకూర్చిన ప్రయోజనాల్ని వివరించారు.
అయన ప్రసంగం తర్వాత ఇష్టా గోష్ఠి జరిగింది.
సభకు హాజరైన వారిలో రాజమండ్రి కధా రచయితలు సర్వశ్రీ తల్లావఝుల పతంజలి శాస్త్రి, మహీధర రామ శాస్త్రి, కోడూరి శ్రీరామ మూర్తి, ముప్పిడి ప్రభాకర రావు, సాహితీ ప్రేమికులు యర్రాప్రగడ రామకృష్ణ, కూర్మయ్య, వెలమాటి సత్యం, డా॥ చైతన్య శేఖర్, అరిపిరాల నారాయణ రావు, ONGC సరస్వతి, డా॥ పి.ఎస్.ఆర్. మూర్తి, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు కమలా నెహ్రూ, ఉపాధ్యక్షులు సునంద ప్రభ్రుతులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment