పాడలేనీ వేళ
ఎలకోయిలై నేను
రాగతంత్రులు మీటి
రవళించగా లేను || పాడ ||
శిధిల శిశిరము జూచి - చిన్నబోయిన నేను
మాధురీ సుధలతో - మదిని నింపగలేను
విరహవేదన తోడ వేగిపోయే వేళ
ఆలపించగ లేను ఆశ్లేష గీతికను || పాడ ||
నవసి పోయిన విరులు
ఇరులతో మొరపెట్టి
కమలి పోయిన కురులు
దీనముగా నవ్వేను
ఎదురు చూచిన కనులు
వేసారి పోయినవి
ఎండుటాకుల జూచి
పాదలేదీ గుండె || పాడ ||
రచన : శ్రీ పైడిపాల
సంగీతం : శ్రీ కృష్ణా రావు
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?hl8826obt1l744q
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?hl8826obt1l744q
0 comments:
Post a Comment