కలలో నీవైతే
కలయే నిజమైతే
నిన్ను కలవరించనా
కలనే వరించనా || కలలో ||
ఏ చిరుగాలులు వీచినా
నీవని తలచితిని
తడబడి నిలిచితిని
నువ్వు రాకనే దరిలేకనే
ఏ విధి మనగలను || నిన్ను ||
ఏ సిరివెన్నెల నవ్వినా
నీ కనుచూపులుగా
ఆవిరి తూపులుగా
మది నెంచనా విలపించనా
నీకై తపియించి || నిన్ను ||
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
రచన : శ్రీ నిర్మల్ కుమార్
సంగీతం : శ్రీ కోపల్లె శివరాం
http://www.mediafire.com/?1jm9y8nv1dscvmd
0 comments:
Post a Comment