నీ అందె రవళిలో
నా డెందమలరగ
నా గళాన సొంపులో
తేనె జల్లు నింపనా|| నీ ||
పూవులు పులకించగ
వెన్నెల విరబూయగ
మధుర మధుర లోకాలలో
నీకు జోలపాడనా || నీ ||
రాగతాళ లయలలో
పదములు కదిలించగ
లలిత లలిత రాగాలతో
వలపు గీతి పాడనా || నీ ||
రచన : శ్రీ శామ్యూల్
సంగీతం : శ్రీ పి.ఏ.రాజు
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?bj1c7v0m89m1w1a
0 comments:
Post a Comment