ఈ చల్లనిరేయి
తిరిగి రానేరాదు
నీ చక్కని మోము
చూడ తనివి తీరదు || ఈ ||
మినుకు మినుకు మనెను కనుల
వెర్రి తారలు
ఆదరిపడెను నా మనసు
వెయ్యిసారులు || ఈ ||
అందమైన చందమామ
చేతి కందదు
అందువరకు నా మనసు
తృప్తి చెందదు || ఈ ||
ఎవరి కొరకు నా హృదయము
ఎదురు చూచునో
తెలియరాదు వలపుగాలి
ఏల వీచునో || ఈ ||
రచన : శ్రీ ఆరుద్ర
సంగీతం : శ్రీ ప్రాణ లింగం
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?buy82vca7trbypq
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?buy82vca7trbypq
0 comments:
Post a Comment