కలల కడలిలో కలికి ముత్యమై (2)
కనుల కొలనులో చిలిపి నృత్యమై
ఉండిపోవా కలలలోనా
నిలిచిపోవా కనులలోనా
తారలనే అడుగుతాను నిన్ను విడిచిపొమ్మని
చందురునే కోరుతాను నిన్ను మరచిపొమ్మని
మేఘాలను వేడుతాను నిన్ను పోనిమ్మని
నీ రాకే తోడై నా యెదను పూలు పూచే || ఉండి ||
హృదయమనే తలుపు తీసి నిన్ను స్వాగతించినాను
ద్వారమందు నిలిచి నీవు బేల చూపు చూసినావు
హృదయమనే తలుపు తీసి నిన్ను స్వాగతించినాను
ద్వారమందు నిలిచి నీవు బేల చూపు చూసినావు
హృదయమా నాహృదయమా (2)
ఆమె స్మృతులే ఇక నీకు జతుల గతులు || ఉండి ||
కలలోనే జీవితాన్ని కడతేరి పోనీ
కనుల నీరు కడవరకు అటుల నిలిచి పోనీ
కలకాలం నీ రూపే తలచుకొనీ (2)
నీ రాకే తోడై నా యెదను పూలు పూచే || ఉండి ||
నీవులేని ప్రతిక్షణము యుగయుగాల నిరీక్షణము
నీ వలపు పిలుపు కోటి వసంతాలు నిలుపు
ఏలనన్నువీడి నీవు దూరమౌతావు
నువులేని బ్రతుకునకు ఏదీ మరి తావు || ఉండి ||
రచన : శ్రీ పి.ఏ.రాజు
సంగీతం : శ్రీ నిర్మల్ కుమార్
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?62va3do5k414tr2
0 comments:
Post a Comment