చెలియందె మ్రోగింది - మృదు మధుర వీణలా
http://www.mediafire.com/?2kx9bg748lz8mbb
నా యెడద నలరించు - సుమనోజ్ఞ కవితలా || చెలియందె ||
నా హృదయ రంగాన - ఆమె వెన్నెల కూన
ఆమె పాదము మ్రోల - గరికనై నిలతునా
నా యెడద నలరించి - నర్తించు నామె
అనురాగ వేదినై - నిలిచిపోదును నేనే || చెలియందె ||
అలదూర దూరాల - ఆ అందె మ్రోగినా
నా తలపు లో కురియు - అందాల విరి వాన
అందెలా అవి - వలపు గుడిలోని ఘంటికలు
అక్షరాకృతి లేని - సుమనోజ్ఞ గీతికలు || చెలియందె ||
ఆమె ఒడిలో నేను - పసివాడనెప్పుడూ
ఆ భావ మిసుమంత - వసివాడదెప్పుడూ
శృంగార సామ్రాజ్య కేతనమ్మే ఆమె
ఆ నీడలో బ్రతుకు ప్రణయ జీవిని నేనే || చెలియందె ||
రచన: శ్రీ కొంపెల్ల.రామకృష్ణ మూర్తి ,
సంగీతం : శ్రీ సుందర రావు,
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
0 comments:
Post a Comment