Wednesday, June 8, 2011

శ్రావణ మేఘమవో


శ్రావణ మేఘమవో - నా జీవన రాగమవో
కవికందని కల్పనవో - హరిచందన శిల్పమవో


కాముని పున్నమి వెన్నెలలో నీ కిన్నెర పదముల సవ్వడిలో 
ఎదపరవశించు నీ ఎంకి పాటలలో 
ఏదో తెలియని వలపు ధ్వనించే 
వీణియవో నా ప్రాణమవో రాగిణివో నా రాణివో
నీ కాలి అందియల సవ్వడిలో 
అనురాగ బంధాల సందిటిలో
నా డెందమలరించి పులకరించి 
మందార మరంద మాధురులు చిందిన   || శ్రావణ ||

నందనవని నీ గానము విని 
అది ఆమని అని మదినెంచి పులకించె
నీ అందముగని చందమామెయని
కలువచెలియ భ్రమచెంది వికసించె
కోయిలవో కాదు కోమలివే 
వెన్నెలవో కాదు కన్నియవే 
పగడాల మోవిపై తూలితూలి
పరువాల తావిలో తేలితేలి  
మధువు చిలుకు నవ కవిత లొలుకు 
అనురాగ సరాగ పరాగము కురిసిన      || శ్రావణ ||



                                                                           రచన,సంగీతం : శ్రీ అరవింద మిత్ర,
                                                                           గానం : శ్రీ యమ్. సత్యనారాయణమూర్తి . 



ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?9cqqyc8jgqcqgec

0 comments:

Post a Comment