అందమైన చందమామ - ముందు నిలిచెనే
నా మనసులోన మధురమైన - హాయి నిండెనే
నా మనసులోన మధురమైన - హాయి నింపెనే || అందమైన ||
కొమ్మమీది కోయిలమ్మ - పాడే కమ్మగా
ఆ పాట విన్న నా మనసు - పరవశించగా (2)
మధుర భావనలలలో - సోలి పోవగా
మధుర భావనలలలో - సోలి పోవగా
మధుర భావలహిరిలో - తేలి పోవగా - తూలి పోవగా || అందమైన ||
కొలను లోని కలువ చేరే - కలువ రాజును
కలవరించు గోరువంక - చేరె చెలియను (2)
నిన్ను చేరి నా మనసు - మురిసి పోయెనే
నిన్ను చేరి నా మనసు - ఎగసి పోయెనే - విరిసి పోయెనే ||అందమైన||
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?s3x7rce94rmat7t
0 comments:
Post a Comment