గుండె భగ్గున మండితే
కన్నీట ఆర్పుట నేర్చుకో
వాసంత మృదు హృదయమ్ములో
గ్రీష్మమ్ముకలదని తెలుసుకో || గుండె భగ్గున ||
జాలి మాలిన వారికై
ఎలుగెత్తి పాటలు పాడిపాడి (2)
బ్రతుకులో అలజడియె గాని
శాంతియన్నది నోచకుంటే (2) || గుండె భగ్గున ||
జరిగిపోయిన కాలమే
శివరంజనీ రాగమ్ముగా (2)
మనసులో నీ తనువులో
మార్మ్రోగి మరి మరి తరిమితే (2) || గుండె భగ్గున ||
నీ విషాదమె నీకు స్వర్గము
అదియె ఊపిరి నీకు సతతము (2)
అది ఎరుంగక ఎవ్వరో
ఓదార్చుటకు నిను చేరుకుంటే (2) || గుండె భగ్గున ||
రచన : శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి
సంగీతం : శ్రీ సుందర రావు
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?snde2kuau6a51uo
సంగీతం : శ్రీ సుందర రావు
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?snde2kuau6a51uo
0 comments:
Post a Comment