ఈ యనంత విశ్వములో - నేనెంతటి వాడను
అణువునైన నౌదునా? పరమాణువైన నౌదునా
కొందరితో పోల్చుకొన్న - గొప్పవాడ ననిపించును
ఆకాశము వంక కనిన - అయ్యో అనిపించును || ఈ ||
పర్వతముల ముందు నేను - పరమాణువునైనకాను
ఉదధి ముందు నే నిలిచిన - ఒక బిందువునైన కాను || ఈ ||
జగధీశుడు నాలోన - సదా వెలుగుచున్నాడట
సృష్టికర్త నేనేనట - సృష్టియెల్ల నేనేనట || ఈ ||
రచన : శ్రీ వక్కలంక లక్ష్మీపతి రావు
సంగీతం : శ్రీ ప్రాణలింగం
0 comments:
Post a Comment