వాలు చూపుల గాలమేసి
నన్ను దోచే ప్రేయసి
నన్ను దోచే ప్రేయసి
వింతగా నను చూడకే చెలి
వేగరావే నా దరి || వా ||
నీలికన్నుల నీవు చూసిన
వలపు పూలై విరిసెనే
పరిమళించి - పరవశించి (2)
వేణుగానము చేసెనే (2)
మది వేణురాగము తీసేనే || వింతగా ||
గుండెలో నువు నవ్వినంతనే
కోటివీణలు మ్రోగునే
ఓపలేని తాపమేదో (2)
నన్ను తొందర చేసెనే (2)
మదిలోన విందులు చేసెనే || వింతగా ||
రచన : శ్రీ కోపల్లె శివరాం
సంగీతం : శ్రీ నిర్మల్ కుమార్
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?heaj8am1xk99cj6
0 comments:
Post a Comment