Wednesday, June 8, 2011

మంచి మనసు


మంచి మనసు - తెలిపేదే స్నేహము 
మనిషి విలువ - నిలిపేదే స్నేహము     

మల్లె కన్న తెల్లని - జాబిల్లి కన్న చల్లని 
తేనే కన్న తీయని - ఏ నాటికి కైనా మారని   (2)      || మంచి ||

మనిషి మనిషి కట్టుకున్న - మరుమల్లెల వంతెనయె  స్నేహము 
మనిషిలోని మంచికి - మారు పేరు స్నేహము  (2)     || మంచి ||

ఆపదలో ఆదుకొని - ఆనందం పంచునదే స్నేహము
కలిమి లేమి అంతరాలు-  కానరాదు స్నేహము  (2)   || మంచి ||


                                                                  రచన, సంగీతం : అజ్ఞాతం 


ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?9bozszne2p76p4z

0 comments:

Post a Comment