ఉదయించకోయి ఓ జాబిలి
ఎదలోని బాధ కదిలించకోయి
కనుచూపుతోనే కరిగించినావు
కలలేమో నాలో మిగిలించినావు
నా శ్వాసలన్నీ నివాళించినాను (2)
నీ ఆశతోనే గుబాళించినాను || ఉ ||
విరహాగ్నితోనే వేసారినాను
తొలినాటి ఆశ చిగురింపకోయి (2)
నీ ఊహలోనే విహారాలు చేసా
నీ ప్రేమలోని విషాదాలు చూసా || ఉ ||
రచన : శ్రీ కోపల్లె శివరాం
సంగీతం : శ్రావణ్
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
http://www.mediafire.com/?pzxd6e2msgpo4nw
0 comments:
Post a Comment